మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి

మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి

వివేక్ ఒబెరాయ్ ఎగ్జిట్ పోల్స్ రోజున ట్విట్టర్ లో షేర్ చేసిన మేమే పెద్ద రగడకు దారితీసింది.  సెలెబ్రిటీల నుంచి ప్రతి ఒక్కరు వివేక్ ట్వీట్ ను విమర్శిస్తూ వస్తున్నారు.  ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ట్వీట్ ను సీరియస్ గా తీసుకుంది.  కేవలం ఫన్ కోసం చేసిన ట్వీట్ ఇలా అవుతుందని అనుకోలేదని అన్నారు.  ఏ మహిళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో తాను ట్వీట్ చేయలేదని అన్నారు.  

 గత పదేళ్లలో 2000 మంది మహిళా సాధికారికత కోసం పాటు పడ్డాయని... తన ట్వీట్ ఏ మహిళనైనా ఇబ్బంది పెట్టి ఉంటె... క్షమించాలని.. ట్వీట్ ను డిలీట్ చేస్తున్నానని చెప్పి వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశాడు. వివేక్ ట్వీట్ డిలీట్ చేయడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టే అనుకోవచ్చు.