నేనెందుకు క్షమాపలు చెప్పాలి

నేనెందుకు క్షమాపలు చెప్పాలి

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలను ఉద్దేశించి నటుడు వివేక్ ఒబెరాయ్ ట్విట్టర్ లో ఓ మీమ్ ని షేర్ చేశారు.  ఐశ్వర్య రాయ్, సల్మాన్, వివేక్ ఒబెరాయ్, అభిషేక్ బచ్చన్ లతో ఐష్ ఉన్న ఫోటోలు అవి.  అభిప్రాయం, ఎగ్జిట్ పోల్స్, రిజల్ట్ అని రాసున్న మీమ్ అది.  మీమ్ ను వివేక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.  సెలెబ్రిటీలు వివేక్ ఒబెరాయ్ ట్వీట్ ను విమర్శించడం మొదలుపెట్టారు.  జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై వివేక్ కు నోటీసులు కూడా ఇచ్చింది.  

వివేక్ ఈ విషయాలపై స్పందిస్తూ... నేనెందుకు క్షమాపణలు చెప్పాలి అని ఎదురు ప్రశ్నించాడు.  మీమ్ ను షేర్ చేశాను అంతే.  ఆ మీమ్ ను చేసింది తాను కాదని అలాంటప్పుడు తననెందుకు క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారో చెప్పాలని వివేక్ ట్వీట్ చేశాడు.  మరి వివేక్ రివర్స్ ట్వీట్ కు సెలెబ్రిటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.