ఒక్క ట్వీట్‌తో అబాసుపాలైన వివేక్ ఒబెరాయ్ !

ఒక్క ట్వీట్‌తో అబాసుపాలైన వివేక్ ఒబెరాయ్ !

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన తాజా ట్వీట్ ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది.  ఎన్నికల ఫలితాల్ని ఉద్దేశించి ఒక నెటిజన్ తయారుచేసిన ఫోటోను వివేక్ ట్వీట్ చేశారు.  అందులో ఐశ్వర్యరాయ్ ప్రేమ వ్యవహారాలు ఉండటమే విమర్శలకు దారితీసింది.  ఐశ్వర్య గతంలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ లతో ప్రేమలో ఉండి చివరకు అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.  

వాటి ఆధారంగా తయారుచేసిన ఆ ఫోటోలో ఐశ్వర్య, సల్మాన్ లని ఉద్దేశించి ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య, వివేక్ లను ఉద్దేశించి ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య, అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశించి ఫైనల్ రిజల్ట్ అని రాసుంది.  ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వివేక్ నీకు జ్ఞానం ఉందా లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.