పోలీసు కస్టడీకి వివేకా హత్య కేసు నిందితులు

పోలీసు కస్టడీకి వివేకా హత్య కేసు నిందితులు

మాజీ మంత్రి మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ లను గురువారం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలుల్లో రిమాండ్ లో ఉన్న వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతించడంతో వారిని కస్టడీలోకి తీసుకున్నారు.