దీపావళి ఆఫర్.. రూ.101 కొట్టు.. ఈ స్మార్ట్‌ ఫోన్ పట్టు..!

దీపావళి ఆఫర్.. రూ.101 కొట్టు.. ఈ స్మార్ట్‌ ఫోన్ పట్టు..!

పండగ సీజన్ వచ్చిందంటూ చాలు.. అన్ని సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.. ఇక దీపావళి సందర్భంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో ఫోన్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.101 డౌన్ పేమెంట్ మాత్రమే చెల్లించి వినియోగదారులు వివో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.. ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఫోన్లను కొనే వారికి మాత్రమే వర్తించనుండగా.. ఆ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. మరోవైపు హెచ్‌డీబీ ఫైనాన్స్‌తో వివో ఫోన్లను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా  పొందే అవకాశం ఉంది. ఇక, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నెలకు కేవలం రూ.926 ఈఎంఐతో వివో ఫోన్లను కొనవచ్చు. అలాగే పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.1,999 విలువైన బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌ను వివో వి17 ప్రొ, ఎస్1 ఫోన్ల కొనుగోలుపై పొందవచ్చు. అంతేకాదు.. వివో ఫోన్లలో.. వి17ప్రొ, వి15ప్రొ, జడ్1ఎక్స్ (8జీబీ ర్యామ్ వేరియెంట్), వి15, ఎస్1, వై17, వై15, వై12 ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్.. 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.