పాలిచ్చే ఆవు ఒరిస్సాకి.. పొడిచే గేదె ఏపీకి: నాగుల్ మీరా

పాలిచ్చే ఆవు ఒరిస్సాకి.. పొడిచే గేదె ఏపీకి: నాగుల్ మీరా

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటించారు. తాజాగా ఈ ప్రకటనపై రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌, టీడీపీ నేత నాగుల్‌ మీరా స్పందించారు. ఒక నియంత ఏపీలో మరోసారి అడుగుపెడుతున్నారని విమర్శించారు. శవాల మీద చిల్లర వేరుకునే రీతిలో మోడీ పర్యటన ఉందన్నారు. బీజేపీ రైల్వే జోన్ ని రాజకీయ కోణంలో చూస్తోంది. పాలిచ్చే ఆవును ఒరిస్సాకి ఇచ్చి.. పొడిచే గేదెను ఏపీకి ఇచ్చారని నాగుల్‌ మీరా ఎద్దేవా చేశారు.

దగ్గుబాటి ఒక రాజకీయ బ్రోకర్ అని నాగుల్‌ మీరా పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసానిలకు ఏపీలో ఏం పని ఉంది. ఏపీ ప్రజలు తలసాని బట్టలు ఉడదీసి పంపే రోజులు దగ్గరలోనే ఉందన్నారు. కులపర మీటింగ్ లో రాజకీయం చేస్తానంటే యాదవులే తలసానిని ఏపీకి రావొద్దు అన్నారు. తలసాని వ్యక్తి గతంగా ఏపీకి రావొచ్చు.. కుల మీటింగ్ లలో రాజకీయాలు చేస్తానంటే సహించే ప్రసక్తిలేదని హెచ్చరించారు. దేశ భవిష్యత్తును కూడా మోడీ రాజకీయంగా చూస్తున్నాడు. మోడీ నరరూప హంతకుడులా వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు.