పోలీస్ అవతారమెత్తాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

పోలీస్ అవతారమెత్తాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

నకిలీ ఎస్సైగా అవతారమెత్తిన ఓ యువకుడిని విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అనే యువకుడు భీమవరంలో డిగ్రీ చదువుతూ మధ్యలో మానేశాడు. అనంతరం విజయవాడలో ఓ హోటల్ లో పనికి కుదిరాడు. కొద్ది నెలలకే ఎస్సై అవతారమెత్తాడు. భీమవరం మండలానికి చెందిన స్వామి, గణేష్, ప్రసాద్ అనే ముగ్గురు యువకులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.24 వేలు వసూలు చేశాడు. గురువారం రోజు ప్రసాద్ పోలీసు యూనిఫామ్ లో తన స్వగ్రామానికి వచ్చాడు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ ఎస్సై అని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.