శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై

శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై

ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నాడీఎంకే, డీఎంకే కూటములు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కరుణ, జయ లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావటంతో అందరిలో ఆసక్తిపెరుగుతోంది. అయితే, జయ మృతి తర్వాత అన్నా డీఎంకేలో అనూహ్యపరిణామాలు ఏర్పడ్డాయి. శశికళ జైలునుంచి విడుదలైన తర్వాత ఇవి మరింత వేడెక్కాయి. పార్టీనుంచి బహిష్కృతమైన శశికళ, మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు... అన్నా డీఎంకేను అధికారంలో తీసుకురావటమే తన లక్ష్యమని చెబుతూ ఆ పార్టీలోకి బ్యాక్‌ డోర్‌ నుంచి ప్రవేశించేందుకు ప్లాన్‌ వేస్తున్నారని.. దీనికోసం బీజేపీ రాయబారాన్ని కోరుతుందనే ప్రచారం జరిగింది.. అయితే, శశికళ సంచలన నిర్ణయం తీసుకుంది... పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు.. తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతారనే అంచనాలు నెలకొన్న సమయంలో.. రాజకీయాలను విడిచిపెడుతున్నట్టు సంచలన ప్రకటన చేవారు.. జయ (జె. జయలలిత) జీవించి ఉన్నప్పుడు కూడా నేను అధికారం కోసం లేదా పార్టీలో స్థానం కోసం ఎన్నడూ పాకులాడలేదు.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వాటి కోసం ఆశపడడంలేదంటూ లేఖలో పేర్కొన్నారు శశికళ. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలంటూ.. అన్నా డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆమె.. జయలలిత బంగారు పాలన తమిళనాడులో కొనసాగాలని ఆకాంక్షించారు.