వోడాఫోన్ ఐడియా 3 నెల‌ల‌ న‌ష్టం రూ. 4973 కోట్లు

వోడాఫోన్ ఐడియా 3 నెల‌ల‌ న‌ష్టం రూ. 4973 కోట్లు

విలీనం త‌ర‌వాత వోడాఫోన్ ఐడియా కంపెనీ ఆర్థిక ప‌లితాల‌ను ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ నెల‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 4,973 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని పొందింది. ఈ రెండు కంపెనీలు ఆగ‌స్టు నెల‌లో విలీన‌మ‌య్యాయి. ఐడియా కంపెనీ ఫ‌లితాలు ఆగ‌స్టు 31 వ‌ర‌కు చెందిన‌వి కాగా, రెండు కంపెనీల ఫ‌లితాలు ఆస్గ‌టు 31 నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క‌లిసి ఉన్నాయ‌ని కంపెనీ పేర్కొంది. దేశంలోనే అత్య‌ధికంగా 42.2 కోట్ల ఖాతాదారులు ఉన్న ఈ కంపెనీ జులై సెప్టెంబ‌ర్ మ‌ధ్య కాలంలో రూ. 7,663కోట్ల ఆదాయాన్ని సాధించింది. కంపెనీ త‌న‌కు ఉన్న ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్‌ను అమ్మేయాల‌ని భావిస్తోంది. సెప్టెంబ‌ర్ 30 తేదీ నాటికి వొడాఫోన్‌ ఐడియా స్థూల రుణాలు రూ. 1,26,100 కోట్ల‌ని కంపెనీ పేర్కొంది.