వాటే ఆఫర్స్‌!

వాటే ఆఫర్స్‌!

టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ అనే సంబంధంలేకుండా వరుస ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే ఈ పోటీలో పలు ఆఫర్లు తెచ్చిన వొడాఫోన్... తాజాగా తమ వినియోగదారులను సరికొత్త ఆఫర్లు తెచ్చింది. తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ. 511, రూ. 569 ప్లాన్లను తీసుకొచ్చిన వొడాఫోన్... ఈ ప్యాక్‌ల కింద ప్రతీరోజు తన యూజర్లకు 2 జీబీ, 3 జీబీ డేటాను అందించనుంది. అయితే ఈ ఆఫర్లు ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది వొడాఫోన్.

ఇక రూ. 511, రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలించినట్లయితే... రూ. 511 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు, ప్రతీ రోజు 2 జీబీ డేటాను 3జీ/4జీ డేటాను అందిస్తుంది... ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా నిర్ణయించింది. ఇక రూ. 569 ప్లాన్ వియానికి వస్తే... ఈ ప్లాన్‌లోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 3 జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించనుంది వొడాఫోన్.