ప్రీపెయిడ్ యూజర్లకు సూపర్ ప్లాన్స్

ప్రీపెయిడ్ యూజర్లకు సూపర్ ప్లాన్స్

టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఈ రూ.511, రూ.569 ప్లాన్లను మే నెలలో మహారాష్ట్ర, గోవా (ముంబై తప్పించి), గుజరాత్, కేరళలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ప్లాన్లను దేశవ్యాప్తంగా వర్తింపజేయనుంది. ఆ రెండు ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.511 ప్రీపెయిడ్ వొడాఫోన్ ప్లాన్
84 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ తో రోజూ 2జీబీ 4జీ/3జీ డేటా అందిస్తోంది. మొత్తంగా 168జీబీ డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంది.

రూ.569 ప్రీపెయిడ్ వొడాఫోన్ ప్లాన్ 
ఈ ప్లాన్ కూడా 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 3జీబీ 4జీ/3జీ డేటా వాడుకోవచ్చు. మొత్తంగా నిర్ణీత గడువుకు మొత్తంగా 252జీబీ డేటా అందిస్తున్నారు. అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు.