ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం

ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం నిర్వహించగా... ఇవాళ రాత్రి 8  నుంచి 10 గంటల మధ్య పున్నమి చంద్రుని వెలుగుల్లో వివాహ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో కల్యాణ వేదికను నిర్మించారు. లక్షలాది మంది భక్తులు కల్యాణ వేడుకలు చూసేలా స్వామివారి కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జర్మనీ తరహాలో షెడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక సమీపంలో సామాన్య భక్తులతోపాటు వీఐపీలు, ప్రముఖులు, కల్యాణ వేడుకలు తిలకించేలా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో షెడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. ఈమారు స్వామివారి కల్యాణం పండువెన్నెలలో జరిగేలా చర్యలు చేపట్టారు. కల్యాణ వేదిక ముఖద్వారాన్ని చూడము చ్చటగా తీర్చిదిద్దారు. 

మరోవైపు కల్యాణ వేదికతోపాటు ఏకశిలానగరం విద్యుత్‌ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలుగొందుతోంది. వివిధ రకాల విద్యుత్‌ కాంతుల మధ్య పలు రకాల దేవతామూర్తులు అందరినీ ఆకట్టు కుంటున్నారు. కల్యాణ వేదిక ముందువైపు మొత్తం ప్రాంగణం షెడ్లతో కప్పే యకుండా ముందువైపు ఖాళీగా ఉంచారు అధికారులు. దీంతో స్వామివారి కల్యాణ వేడుకలు పున్నమి చంద్రుని వెలుగుల్లో భక్తులను కనువిందు చేయనున్నాయి. టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదికను పలురకాల పూలు, టెంకా యలు, అరటి ఆకులు, మామిడి ఆకు లు, మామిడి కాయలు, రెడ్‌ ఆఫీల్‌, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్క జొన్న తదితర ఫలాలతో సాంప్రదా యబద్ధంగా అలంకరించనున్నారు. మరోవైపు కోదండరాముని కల్యాణంలో చంద్రబాబు పాల్గొనడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోకూడదని షరతు విధించింది ఎన్నికల సంఘం. వేర్వేరుగా ప్రత్యేక విమానాల్లో గురువారం సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు చేరుకోనున్న గవర్నర్, ముఖ్యమంత్రి... ముఖ్యమంత్రి ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో, గవర్నర్‌ స్టేట్‌గె్‌స్టహౌ్‌సలో కాసేపు విశ్రమిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన ఒంటిమిట్టకు చేరుకుని కల్యాణాన్ని తిలకిస్తారు.