మోడీ పై అత్యుత్సాహం.. ఈసీ నోటీసులు

మోడీ పై అత్యుత్సాహం.. ఈసీ నోటీసులు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఓ అభిమాని అత్యుత్సాహం చూపించి, ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఉత్తరాఖండ్ కు చెందిన జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి ప్రధాని మోడీ వీరాభిమాని. తన కుమారుడి పెళ్లి పత్రికల్లో వివాహానికి వచ్చే అతిథులు బహుమతులు తీసుకురావద్దు. వధూవరులను ఆశీర్వదించడానికి ముందు..దేశహితం కోరి ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌లో మోదీకి ఓటెయ్యండి’ అని రాయించాడు. అదే తమకు ఇచ్చే బహుమానమని తెలిపాడు. దీన్ని ఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించింది. సదరు వ్యక్తి రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఈ విషయంపై జోషి స్పందించారు. తాను ఎన్నికల సంఘాన్ని క్షమాపణలు కోరుతానని, తనకు తెలియకుండా తన పిల్లలు ఈ పని చేశారని తెలిపాడు.