నేడు ఓటరు నమోదుకు మరో అవకాశం

నేడు ఓటరు నమోదుకు మరో అవకాశం

ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇవాళ మరో అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌లో 'ఓటర్‌ స్పెషల్‌ క్యాంపెయిన్‌ డే' నిర్వహిస్తోంది. ఇవాళ నగరంలోని  పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఓటర్లు పరిశీలించుకోవచ్చు.  పేరు లేని పక్షంలో అక్కడికక్కడే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు చెందిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.