దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం

దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం

ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని పోలింగ్ బూత్ కు ఓటేసేందుకు వచ్చారు. ఆయన నేరుగా బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ క్యూలో ఉన్న వారు అభ్యంతరం తెలిపారు. అందరితో పాటే లైన్ లో నిలుచుని ఓటేయాలని సూచించారు. దీంతో చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.