ఐదో విడతలో 51 స్థానాల్లో పోలింగ్ ప్రారంభం..

ఐదో విడతలో 51 స్థానాల్లో పోలింగ్ ప్రారంభం..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ 7 రాష్ట్రాల పరిధిలోని 51 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది... ఐదోవిడతలో దేశవ్యాప్తంగా 674 మంది అభ్యర్థులు బరిలోగా ఉన్నారు. 51 లోక్‌సభ స్థానాల్లోని 9,688 పోలింగ్‌ కేంద్రాల్లో 8.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 51 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో.. బీహార్‌లో ఐదు, జమ్మూకశ్మీర్‌లో రెండు, జార్ఖండ్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌లో ఏడు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్‌ లోని 7 లోకసభ స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. 

ఇక వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ జరగుతోన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే బీహార్‌లోని సీతామారహీ, మధుబాని, ముజాఫర్‌ పూర్‌, సారన్‌, హాజీపూర్‌లో.. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌, లడఖ్‌ స్థానాల్లో, జార్ఖండ్‌లోని కోదర్‌మా, రాంచీ, ఖుంటి, హజారీబాగ్‌ స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ ఘర్‌, దోమ్హా, ఖజురహో, సాత్నా, రేవా, హోసన్‌ గాబాద్‌, బేతుల్‌లో.. రాజస్థాన్‌లోని గంగానగర్‌, బికానేర్‌, చూర్‌, జ్హౌంన్‌జ్హౌను, సికార్‌, జైపూర్‌ రూరల్‌, జైపూర్‌, అళ్వార్‌, భరత్‌ పూర్‌, కౌరాలీధోల్‌ పూర్‌, దౌసా, నాగాఔర్‌ స్థానాల్లో.. ఉత్తరప్రదేశ్‌లోని ధౌవుర్హారా, సీతాపూర్‌, మోహన్‌ లాల్‌ గంజ్‌, లక్నో, రాయ్‌ బరేలీ, అమేథీ, బండా, ఫతేపూర్‌, కౌశంబి, బారాబాంకీ, ఫైజాబాద్‌, బార్హైచ్‌, కైసర్‌ గంజ్‌, గోండాలో.. పశ్చిమ బెంగాల్‌లోని బన్‌ గాన్‌, బారక్‌ పూర్‌, హౌర్హా, ఉల్బెరియా, శ్రీరాంపూర్‌, హుగ్లీ, ఆరాంబాగ్‌ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.