రెండో దశ పోలింగ్ ప్రారంభం..

రెండో దశ పోలింగ్ ప్రారంభం..

సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. కీలక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత కల్పించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1600 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. లక్షా 81 వేల పోలింగ్ బూత్‌లలో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు 38 (వేలూరు ఎన్నిక వాయిదా) పుదుచ్చేరి 1, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తరప్రదేశ్ 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్ 3, బెంగాల్ 3, కాశ్మీర్ 2, మణిపూర్ 1, స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా రెండో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా, 14 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.