సీఎం కేసీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు, అరెస్ట్

సీఎం కేసీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు, అరెస్ట్

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రజల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రా యువకుడిని ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన తగరం నవీన్ అనే యువకుడు టిక్ టాక్, ఫేస్ బుక్ లలో కేసీఆర్, తెలంగాణ ప్రజల పట్ల అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోను అప్ లోడ్ చేశాడు. ఈనెల 20న టీఆర్ఎస్ నాయకులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని తిరువూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు.