'పోలవరంపై నాకు అనుమానాలున్నాయ్‌'

'పోలవరంపై నాకు అనుమానాలున్నాయ్‌'

పోలవరం నిర్మాణాలపై తనకు అనుమానాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ తన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో పోలవరం సందర్శనకు ప్రజలను తరలిస్తున్నారని.. కానీ తన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని అన్నారు.  2018 లోనే పోలవరం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామన్నారని.. కానీ ఇప్పటికీ పూర్తవలేదని అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సమీపాన మట్టి కుంగిపోతుంటే పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం దగ్గర జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు అధికారులు తనకు చెబుతున్నారని ఉండవల్లి తెలిపారు. కేంద్రం సహాయం లేదు.. ప్రాజెక్టును కట్టలేం అని చెప్పకుండా.. పూర్తి చేసేస్తున్నామంటూ బాబు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.