23 వరకు వెయిట్‌ అండ్ సీ: జేడీ

23 వరకు వెయిట్‌ అండ్ సీ: జేడీ

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను చూసి ఆందోళన చెందవద్దని, 23వ తేదీ వరకు వేచి చూడాలని జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను గెలిచినా, ఓడినా ప్రజాసేవలోనే ఉంటానని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా ఫలితాలను లెక్కగట్టడం సరైనది కాదన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు తమ కచ్చితత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము సేకరించిన నమూనాలపై నమ్మకం వుంటే బాండ్ పేపర్ పై రాసివ్వాలని అభిప్రాయపడ్డారు. జనసేన ఎన్నికల కోసం కాదని.. మార్పు కోసం వచ్చిన పార్టీ అని చెప్పిన జేడీ.. మద్యం, ధన ప్రవాహం లేని ఎన్నికల కోసం ప్రయత్నించామన్నారు. మార్పు ఎంతవరకూ వచ్చిందో ఫలితాల తర్వాత తేలుతుందన్నారు.