నటుడిగా వినాయక్ కొత్త అవతారం !

నటుడిగా వినాయక్ కొత్త అవతారం !

 

దర్శకుడు వివి వినాయక్ ఈమధ్య చెప్పుకోదగిన విజయాలేవీ అందుకోలేకపోయారు.  ఆయన గత చిత్రం 'ఇంటలిజెంట్' సైతం విఫలమైంది.  ఈమధ్య పలువురి హీరోల కోసం ఆయన కథలు రాస్తున్నారని వార్తలు వెలువడినా వాటిలో వాస్తవం లేదని తేలింది.  తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు వినాయక్ త్వరలో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  'శరభ' ఫేమ్ నరసింహ రావు డైరెక్ట్ చేయనున్న సినిమాలో వినాయక్ ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారట.