వినాయక్ లుక్ .. మాస్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు..!! 

వినాయక్ లుక్ .. మాస్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు..!! 

వివినాయక్ దర్శకుడిగా అనేక సినిమాలు చేశారు.  ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, దిల్ రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వినాయక్ బెస్ట్ సినిమాల్లో కొన్ని అని చెప్పొచ్చు.  ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారుతున్నారు.  దిల్ రాజు నిర్మాణంలో వివి వినాయక్ లీడింగ్ రోల్ చేస్తూ సీనయ్య అనే సినిమా చేస్తున్నారు.  టైటిల్ క్లాస్ గా ఉన్నా ఆ టైటిల్ ను డిజైన్ చేసిన విధానం పక్కా మాస్ గా కనిపిస్తోంది.  

వినాయక్ లుక్ సైతం అంతే మాస్ గా ఉన్నది. చేతిలో ఓ రెంచ్, మేడలో రెడ్ కలర్ టవల్ తో సీరియస్ లుక్ లో ఉన్న ఫోటో అది.  రేపు వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  శరభ సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుండటం విశేషం.  దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వినాయక్, నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిద్దాం.