సినిమాను మొదలుపెట్టే పనిలో వినాయక్ !

సినిమాను మొదలుపెట్టే పనిలో వినాయక్ !

ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్  బస్టర్ హిట్లిచ్చిన దర్శకుడు వివి వినాయక్ కొన్నాళ్లుగా  రాణించలేకపోతున్నారు.  2017లో వచ్చిన చిరు 150వ చిత్రం 'ఖైదీ నెం 150' ఆయన లాస్ట్ హిట్.  ఆయన చివరగా చేసిన 'ఇంటలిజెంట్' కూడా పరాజయం చెందింది.  దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన ఒక కథను సిద్ధం చేసుకుని మాస్ మహారాజ రవితేజకు వినిపించారట.  రవితేజకు కూడా కథ బాగా నచ్చిందట.  మరి వీరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.  గతంలో వీరిద్దరూ కలిసి  చేసిన 'కృష్ణ' చిత్రం మంచి విజయంగా నిలిచిన సంగతి తెలిసిందే.