ఆ బ్యాంక్ సేవలపై వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి

ఆ బ్యాంక్ సేవలపై వీవీఎస్ లక్ష్మణ్ అసంతృప్తి

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ ఓ బ్యాంకు సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు... సోషల్ మీడియా వేదికగా ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క సేవలు, కస్టమర్ కేర్ యొక్క పనితీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ సేవలు మరియి కస్టమర్ కేర్ పనితీరుతో నిజంగా నిరాశ చెందానని పేర్కొన్న లక్ష్మణ్.. వారు వచ్చి తమ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయండి.. అన్ని రకాల సేవలను అందిస్తామని వాగ్దానం చేస్తారని.. కనీసం వారికి బ్యాంకింగ్ యొక్క ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవని మండిపడ్డారు. కాగా, ఈ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్‌కు వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. అయితే, ఆయనే ఇంతలా స్పందించారంటే.. మరి ఆ బ్యాంకింగ్ సేవలతో ఆయన ఎంత విసిగిపోయారోమరి.