ఎన్టీఆర్ తో వైజయంతి మూవీస్ సినిమా..!!

ఎన్టీఆర్ తో వైజయంతి మూవీస్ సినిమా..!!

జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఆల్ టైమ్ గ్రేట్ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ.. కొంతకాలం పాటు స్తబ్దతగా ఉన్నది.  ఆ తరువాత, మహానటి సినిమాతో తిరిగి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. హిట్ కొట్టింది.  మహానటి ఇచ్చిన హిట్ తో.. వైజయంతి మూవీస్ సంస్థ భారీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైంది.  

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాకు ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నది.  ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు చేసేందుకు వైజయంతి మూవీస్ సిద్ధమైనట్టు తెలుస్తున్నది.  అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాగా, రెండో సినిమా విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు సి అశ్వినీదత్ పేర్కొన్నారు.  అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తారట.  

ప్రస్తుతం నాగార్జున, నాని మల్టీ స్టారర్ గా వస్తున్న దేవదాస్ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్నది.  సెప్టెంబర్ 20 వ తేదీన ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.