కత్తులతో పొడుచుకున్న రజినీ, అజిత్ ఫ్యాన్స్ !

కత్తులతో పొడుచుకున్న రజినీ, అజిత్ ఫ్యాన్స్ !

తమిళనాడులో స్టార్ హీరోల అభిమానుల నడుమ వివాదాలు చోటు చేసుకొవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.  సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించే అక్కడి అభిమానులు తమ హీరోల మీదున్న అభిమానంతో కొట్లాటలకు కూడ దిగుతుంటారు.  ముఖ్యంగా అజిత్, రజినీ, విజయ్ అభిమానుల నడుమ ఈ ఫ్యాన్ వార్ నడుస్తుంటుంది.  ఈరోజు రజినీ 'పేట', అజిత్ 'విశ్వాసం' సినిమాలు రిలీజయ్యాయి.  ఇంకేముంది ఫ్యాన్ వార్ మళ్ళీ మొదలైంది.  పలుచోట్ల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి.  వేలూరులో అయితే ఏకంగా ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు.  ఈ గొడవలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.