వ్యాక్సిన్: మరో ఇద్దరు అంగన్‌వాడీలకు అస్వస్థత

వ్యాక్సిన్: మరో ఇద్దరు అంగన్‌వాడీలకు అస్వస్థత

అంగన్ వాడి కార్యకర్త వనిత మృతి ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో ఇద్దరు అంగన్ వాడి కార్యకర్త అస్వస్థత కావడం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.  న్యూ శాయంపేట్ అర్బన్ హెల్త్ సెంటర్ లో వనిత వేసుకున్న వయల్ నుండే  కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న జ్యోతి, రజితలు అస్వస్థతకు గురి కావడం వరంగల్ జిల్లాలో చర్చకు దారి తీసింది. నిన్న అస్వస్థతకు గురైన జ్యోతిని చికిత్స కోసం నిన్న నిమ్స్ కి తరలించగా ఈరోజు అస్వస్థతకు గురైన రజితను వరంగల్ ఎంజీఎంలోని ఆర్ఈసిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే టెన్షన్ కి గురి కావడంతోనే అంగన్ వాడి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు కౌన్సెలింగ్ చేస్తున్నామని డిఎంహెచ్ఓ లలిత అంటున్నారు.