ఉద్యోగాలపై అభ్యర్థులు మోసపోకండి..

ఉద్యోగాలపై అభ్యర్థులు మోసపోకండి..

ఆర్మీలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల నియామకాల కోసం  వరంగల్ జిల్లా హన్మకొండ జేఎన్‌ఎస్‌ మైదానం సిద్ధమైంది. రేపట్నుంచి ఈ నెల 30వరకు అభ్యర్థులకు దేహదారుఢ్య, వైద్య, అర్హత పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఈ నియామకాలపై జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి ఈరోజు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌, నగరపాలక కమిషనర్‌ గౌతమ్‌ సైనిక అధికారులతో కలిసి జేఎన్‌ఎస్‌ మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థులు దళారీలను ఆశ్రయించి వారి మాటల్ని నమ్మొద్దని తెలియజేశారు. ఈ నియామకాల కోసం అన్నీ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పై విధంగా స్పందించారు.