వరంగల్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...

వరంగల్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ తెలిపారు. నేరాలను నియంత్రించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు విజయం సాధించారని వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ప్రకటించారు. అలాగే మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను ప్రకటించారు. ముఖ్యంగా గత ఏడాది కన్న ప్రస్తుత సంవత్సరంలో నేరాలు సంఖ్య ఘన ణీయంగా తగ్గిందని. ఇందులో హత్యలు 23.81 శాతం కాగా, దోపిడీలు,42.86, దొంగతనాలు 21శాతం, మోసాలు 30శాతం తగ్గడం జరిగింది. అదే విధంగా మహిళ లపై దాడుల సంబంధించి 26 శాతం తగ్గించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు విజయం సాధించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు ముందస్తూ జాగ్రత్తలు  తీసుకోవడంతో గత సంవత్సరం 1050 రోడ్డు ప్రమాద సంఘటలు కాగా ప్రస్తుత సంవత్సరంలో కేవలం 850 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అధే విధంగా ప్రమాదాల్లో మరణించి వారిలో గత సంవత్సరం 369 మంది మరణించగా ఈ సంవత్సరం 330 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణించారు అని పేర్కొన్నారు.