కాళోజి హెల్త్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం...

కాళోజి హెల్త్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం...

వరంగల్ అర్బన్ జిల్లా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బిడిఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని వీసీ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపిన ఆయన  నిట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్ర  వ్యాప్తంగా 4800 సీట్లతో అటుగా ఈడబ్ల్యుఎస్ 190 సీట్లు ఉన్నాయి. గవార్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు, ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు, మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు ఉన్నాయి. ఒక్క కొత్త కాలేజీ వచ్చింది. 13 డెంటల్ కాలేజీ లో 1340 సీట్లు ఉన్నాయి. వెబ్ ఆప్షన్లు ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సర్టిఫికేట్ వేరిఫికేషన్ చేస్తాం అని తెలిపారు. కాలేజ్ స్టాట్ అయిన తరువాత ఫిజికల్ వేరిఫికేషన్, అల్ ఇండియా కోటలో వెళ్లిన వారు సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్ అని తెలిపారు. ఇక కరోనా ను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాస్స్ స్టార్ట్ చేస్తాం అని అన్నారు.