వరంగల్ సందర్శించిన క్యాథరిన్ హడ్డా

వరంగల్ సందర్శించిన క్యాథరిన్ హడ్డా

అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా వరంగల్ లోని పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు. ఓరుగల్లు పర్యటన విశేషాలను తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక వెయి స్థంభాల దేవాలయం, కాకతీయ కళాతోరణం, పాండవులగుట్టను సందర్శించి అక్కడి అందాలకు, శిల్పకళా నైపుణ్యానికి ముగ్ధురాలయ్యానన్నారు. ఈ విషయాలను క్యాథరిన్ హడ్డా స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వెయి స్థంభాల దేవాలయం, పాండవులగుట్ట ప్రాచీన శిలాయుగపు చారిత్రక ఆధారాలకు నిలయంగా ఉందని అన్నారు. 

ఇటీవలే నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో ఆమె భేటీ అయినప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించారు. ప్రభుత్వ కృషిని తెలుసుకున్న హడ్డా తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు.