లక్కీ డ్రా పేరుతో యువకునికి గాలం

లక్కీ డ్రా పేరుతో యువకునికి గాలం

బంపర్ లక్కీ డ్రా పేరుతో ఓ యువకుడు మోసపోయిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. బంపర్ లక్కీ డ్రా పేరుతో జనగామ జిల్లాలోని నర్మెట గ్రామానికి చెందిన యువకుడు దన్నారపు శివకుమార్ కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. సఫారీ కారు ఇస్తామని చెప్పి శివకుమార్ దగ్గర నుండి సుమారు 60 వేల వరకు వసూలు చేసారు. మోసపోయానని తెలుసుకున్న శివకుమార్ నర్మెట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై పరమేశ్వర్ విచారణ చేపట్టారు.