పంథా మార్చిన మాటల మాంత్రికుడు..?

పంథా మార్చిన మాటల మాంత్రికుడు..?

టాలీవుడ్‌లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబోల్లో ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబో కూడా ఉంటుంది. వీరిద్దరి కాంబోను చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అయితే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేతా భారీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా సిద్దమవుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే అనేక రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అన్న పేరును పెట్టనున్నారని, ఈ చిత్రం పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో పుకారు ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై సరికొత్త వార్త వినిపిస్తుంది. అయితే సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారు. ఒక్కోసారి ముగ్గురు కూడా ఉంటారు. అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్‌తో చేయనున్న సినిమాలో రష్మిక, పూజ హెగ్దేలు హీరోయిన్‌లని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీరితో పాటుగా బాలీవుడ్ భామ వరీనా హుస్సేన్ ఈ సినిమాలో కథానాయికగా చేస్తున్నట్లు పూకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే.