జగన్ కు కేసీఆర్ ఘనస్వాగతం (ఫోటోలు)

జగన్ కు కేసీఆర్ ఘనస్వాగతం (ఫోటోలు)

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. శనివారం గవర్నర్‌తో భేటీ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ ప్రగతి భవన్‌కు రాగా.. కేసీఆర్‌ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్‌ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు. ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.