వరల్డ్‌కప్ ముందు భారత్‌కు ఫైనల్ ఛాన్స్
ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో భారత్ వామప్ మ్యాచ్ ఆడనుంది. తొలి సన్నాహక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా.. ఇవాళ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో.. మెగా టోర్నీ ప్రారంభానికి ముందున్న ఏకైక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడని కేదార్ జాదవ్, విజయ్‌శంకర్‌లు ఇవాళ్టి మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. కార్డిఫ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇదే వేదికపై పాకిస్థాన్‌తో జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దవడంతో ఈ మ్యాచ్ ద్వారానైనా లబ్ధి పొందాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)