కరుణానిధి మనవరాలికి అరెస్టు వారెంట్‌..!

కరుణానిధి మనవరాలికి అరెస్టు వారెంట్‌..!

డీఎంకే మాజీ అధ్యక్షుడు దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు షాకిచ్చింది. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంతో ఆమెకు న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అంజుగ సెల్వికి.. కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కుమార్తె. 2009-10వ ఆర్థిక సంవత్సరం నుంచి ఆమె ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయక పోవడంతో చెన్నైలోని ఆదాయ పన్ను శాఖ అధికారులు కేసు పెట్టారు. విచారించిన న్యాయస్థానం అంజుగసెల్వికి అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమె మొత్తం రూ.70 లక్షలు పన్ను బకాయి పడింది.