అమెరికా దాకా చేరిన ప్రణయ్ పరువుహత్య !

అమెరికా దాకా చేరిన ప్రణయ్ పరువుహత్య !

గతేడాది మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు గురైన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి, తాను వద్దన్నా అతనిని పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత ఐదునెలల గర్భిణి కాగా తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ హత్య మనదేశం మొత్తం కలకలం రేపింది. ప్రణయ్, అమృత వర్షిణిల విషాద ప్రేమకథ ప్రతిష్టాత్మక వాషింగ్టన్ పోస్ట్ కధనాన్ని ప్రచురించింది. A young Indian couple married for love. Then the bride's father hired assassins` అనే హెడ్ లైన్ తో ఈ వార్త వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ లో ప్రపంచానికి చాటారు. ప్రణయ్, అమృత వర్షిణ ప్రేమ ఎలా మొదలైందనే అంశంతో పాటు హత్యకు దారి తీసిన కారణాలను ఈ ప్రత్యేక కధనంలో ప్రచురించారు. అమృత బిడ్డతో ఉన్న పిక్స్ కూడా ఈ కధనంలో ప్రచురించారు.