మరో వికెట్ చేజార్చుకున్న ఆసీస్... స్మిత్ ఔట్ 

మరో వికెట్ చేజార్చుకున్న ఆసీస్... స్మిత్ ఔట్ 

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టును భారత యువ బౌలర్లు కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. జట్టు ఓపెనర్లను ఇద్దరిని త్వరగా పెవిలియన్ కు చేర్చిన భారత బౌలర్లు ఇప్పుడు రెండో సెషన్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (36) ను ఔట్ చేసారు. అయితే ఈ వికెట్ తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో మొదటి వికెట్ తన ఖాతాలో వేసుకున్న భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్. దాంతో 35 ఓవర్లు ముగిసే సమయానికి 91/3 తో ఆసీస్ నిలిచింది. ఆసీస్ ఆటగాడు లాబుస్చాగ్నే(37)తో తన బ్యాటింగ్ కొనసాగిస్తుండగా మాథ్యూ వేడ్ కొత్తగా బ్యాటింగ్ కు వచ్చాడు.