వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

పాకిస్థాన్‌ లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌కు ఇంగ్లండ్‌లో ఘోర అవమానం జరిగింది. మాంచెస్టర్‌ సిటీ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కేందుకు వచ్చిన అక్రమ్‌ను చెక్ చేసిన సిబ్బంది.. ఆయన బ్యాగ్‌లో ఉన్న ఇన్సులిన్‌ బాటిల్స్‌ను తీసి చెత్త బుట్టలో పడేశారు. అంతటితో ఆగకుండా కాసేప నిలబెట్టి ప్రశ్నించారు. ఇతర ప్రయాణికులు చూస్తుండగానే ఇదంతా జరగడంతో అవమానానికి గురయ్యానని అక్రమ్‌ పేర్కొన్నాడు. ఈమేరకు తన బాధను ట్వీట్‌ చేశాడు. తాను డయాబెటీస్‌ వ్యాధిగ్రస్థుడినన్న అక్రమ్‌.. ఇన్సులిట్‌ బాటిల్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించానని.. ఎక్కడా తనకు ఇటువంటి అనుభవం ఎదురవలేదని అన్నారు. దాదాపు 20 ఏళ్లుగా అక్రమ్‌ ఎక్కడికెళ్టినా వెంట ఇన్సులిన్‌ను తీసుకెళ్లాడు. ప్లేయర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలాగే తీసుకెళ్లేవాడు.