భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై అక్రమ్‌ కామెంట్స్

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై అక్రమ్‌ కామెంట్స్

'భారత బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. కానీ పాకిస్థాన్‌ వారితో సరితూగగలదు' అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్‌ లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌. ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైన నేపథ్యంలో అక్రమ్‌ స్పందించాడు. ఒత్తిడిని అధిగమించే జట్టే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. 'ప్రతి మ్యాచ్‌లానే ఇది కూడా కేవలం ఒక మ్యాచ్‌. ఇందులో ఒక జట్టు గెలుస్తుంది. మరో జట్టు ఓడిపోతుంది. అంతేగాని.. యుద్ధంలా భావించరాదు' అని అన్నాడు. భారత్‌తో ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ బోణీ కొట్టని పాక్‌.. ఈ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేస్తుందని అక్రమ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.