బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు భారత కోచ్‌

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు భారత కోచ్‌

మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ టీమ్‌కు భారత మాజీ క్రికెటర్‌ కోచింగ్‌ ఇవ్వనున్నాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ నీల్‌ మెకన్జీ స్థానంలో వసీం జాఫర్‌కు అవకాశం దక్కింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అకాడమీ క్రికెటర్లకు ప్రస్తుతం జాఫర్‌ శిక్షణనిస్తున్నాడు. ఈక్రమంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ బాధ్యతలను కూడా అతనికే అప్పజెప్పింది ఆ దేశ క్రికెట్‌ బోర్డు.