వైరల్ వీడియో: లారాకి బ్రెట్ లీ బౌన్సర్

వైరల్ వీడియో: లారాకి బ్రెట్ లీ బౌన్సర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2109లో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న బ్రెట్ లీ, బ్రియాన్ లారా నగరాల మధ్య ప్రయాణిస్తూనే కాస్త ఖాళీ దొరికినా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శుక్రవారం ముంబై వీధుల్లో వీళ్లిద్దరూ గల్లీ క్రికెట్ ఆడారు. రెండు ఓవర్ల పాటు బ్యాట్, బంతికి మధ్య జరిగిన సమరంలో మాజీ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మరోసారి తన బౌలింగ్ పదును చూపించాడు. విండిస్ బ్యాటింగ్ గ్రేట్ బ్రియాన్ లారాపై కత్తిలాంటి బౌన్సర్ సంధించాడు. లారా బంతి లైన్ నుంచి తప్పుకోబోయాడు. కానీ లీ బంతి మెరుపు వేగంతో దూసుకొచ్చి ఛాతికి తగిలింది. ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ 'అతనిలో (బ్రియాన్ లారా) ఇంకా ఆట మిగిలే ఉంది' అని బ్రెట్ లీ రాశాడు.

మరో గల్లీ బాయ్ కి అంగుళమైనా లైన్ మిస్ కాకుండా యార్కర్ వేసిన వీడియోని కూడా బ్రెట్ లీ షేర్ చేశాడు. ఆ యార్కర్ కన్ను మూసి తెరిచేంతలో దూసుకొచ్చి వికెట్లను పడగొట్టింది. మాజీ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు కెవిన్ పీటర్సన్, గ్రేమ్ స్మిత్ లు కూడా గల్లీ క్రికెట్ ఆడారు. ఇది చూసిన ఫ్యాన్స్ చుట్టూ గుమిగూడి వీళ్లను ఉత్సాహపరిచారు.