గోదావరి వరద.. 12 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

గోదావరి వరద.. 12 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

గోదావరి వరద ఉదృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్ట 13 అడుగులకు చేరుకుంది. బ్యారేజీ నుండి 11 లక్షల 65 వేల  క్యూసెక్కుల నీటినీ సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13.75 అడుగులకు నీటిమట్టం పెరిగితే మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా  జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. దేవీపట్నం మండలం కొండమొదలులో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరకుల కోసం జనం అల్లాడుతున్నారు. కోనసీమలోని అయినవిల్లిలంక, ఎదురుబిడిం, పి.గన్నవరం మండలం చాకలివారిపాలెం వద్ద కాజ్‌వేపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. సుమారు 1200 హెక్టార్లలో కూరగాయల తోటలు నీట మునిగాయనా ప్రాథమిక అంచానా.