ఇరు రాష్ట్రాల అంగీకారం.. రేపే సాగర్ నుంచి నీటి విడుదల..

ఇరు రాష్ట్రాల అంగీకారం.. రేపే సాగర్ నుంచి నీటి విడుదల..

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది... శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తోంది నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు. నాలుగైదు రోజులు ఇదే ప్రవాహం కొనసాగితే నాగార్జున సాగర్ నిండుకుండలా మారిపోనుంది. అయితే, నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో రేపు సాగర్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో.. సాగర్ నుంచి రేపు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. మరోవైపు తుంగభద్రలో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది.. 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో.. శ్రీశైలం డ్యామ్‌కు వచ్చే వరద ప్రవాహం క్రమంగా కొనసాగడం.. లేదా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. దీంతో.. నాగార్జున సాగర్‌కు నాలుగుగైదు రోజుల్లో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.