శివరాత్రి పుణ్యస్నానాల కోసం నీరు విడుదల

శివరాత్రి పుణ్యస్నానాల కోసం నీరు విడుదల

శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి 2000 క్యూసెక్కుల నీటిని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల వద్ద గోదావరి నదిలో భక్తులు ఏటా పెద్దఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.