ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ ఏమన్నారంటే..

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ ఏమన్నారంటే..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. 'ప్రజలకు కూడా రెడీగా ఉన్నారు. మీరు సిద్ధమా?' అంటూ కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు. ఇవాళ టీఆర్‌ఎస్‌లో దానం నాగేందర్‌ చేరిన సందర్భంగా కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 100కి పైగా సీట్లతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని వివిధ సర్వేలు చెబుతున్నాయని అన్నారు. 100 సీట్లలో తమకు 50 శాతం ఆధిక్యత కనిపిస్తోందని, 82 సీట్లలో 60 శాతానికి పైగా ఆధిక్యత కనిపిస్తోందని కేసీఆర్‌ చెప్పారు. 
 

మనమే ఫస్ట్‌..
తాము అమలు చేస్తున్న పథకాలేవీ రాజకీయం కోసం ప్రారంభించినవి కాదని కేసీఆర్‌ అన్నారు. నాలుగేళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్నామని, అందుకే 90కి పైగా అవార్డులు అందుకోగలిగామని అన్నారు. 2020నాటికి ఎటుచూసినా ఆకుపచ్చగా కనిపించే తెలంగాణ సాధిస్తామని అన్నారు. ఐఏఎస్‌ ర్యాంకుల్లో కూడా తెలంగాణ బిడ్డే టాప్‌ర్‌ అని, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. కేసీఆర్‌ని గద్దె దించడమే తమ కర్తవ్యమని కాంగ్రెస్‌వాళ్లు అంటున్నారని, వాళ్లది దిక్కుమాలిన కర్తవ్యమని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలను చూస్తే నవ్వొస్తుందని అన్నారు. చర్చిద్దాం అంటే ప్రిపేర్‌ అవలేదని టీపీసీసీ నేత ఉత్తమ్‌ అంటారని, ప్రిపేరవకుండా అసెంబ్లీకి ఎలా వస్తారని ప్రశ్నించారు. తమ పార్టీలో తెలివి తక్కు దుష్మన్‌లు ఎక్కువమంది ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 


వాళ్ల దమ్ము మనకు తెలియదా..
సమైక్యాంధ్ర నేతలు మేధావులని అనుకున్నారని, మరి అలాంటప్పుడు 24 గంటల కరెంటును ఎందుకివ్వలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. సీఎంకు దమ్ముందా అని బీజేపీ నేతలు అంటున్నారని.. వారికి ఎంత దమ్ముందో తమకు తెలుసని అన్నారు. అమిత్‌ షా వచ్చి అడ్డం..పొడుగు మాట్లాడతారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.  అది చేస్తాం అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దలు అన్నారని, కానీ అక్కడ ధమ్కీలు తప్ప ఇంకేం లేదని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.