ప్రతి మ్యాచ్‌లో రాణించేందుకే ప్రయత్నిస్తున్నాం

ప్రతి మ్యాచ్‌లో రాణించేందుకే ప్రయత్నిస్తున్నాం

మాడ్రిడ్: ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌లో రాణించేందుకే ప్రయత్నిస్తున్నామని అట్లేటికో మాడ్రిడ్ ఫుట్ బాల్ టీమ్ హెడ్ కోచ్ డైగో సిమియోన్ అన్నారు. ఈ జట్టు బార్సలోనాపై 1-0తో విజయం సాధించింది. అయితే అట్లాటికో మాడ్రిడ్- బార్సలోనా మధ్య వండా మెట్రొపోటిటానో వేదికగా జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో కోయ్‌మాన్‌ను జట్టును ఓడించి ల లిగా స్టాండింగ్స్‌లో రెండవ స్థానికి వచ్చింది. ఈ విజయంతో అట్టాటికాకు బార్సాకు మధ్య 9 పాయింట్ల తేడా ఏర్పడింది. ‘మా ఆటగాళ్లు గత సీజన్‌క ఈ సీజన్‌కు ఎంత ఎదిగారన్నది మాకు ముఖ్యం. వారి పడిన కష్టం కనిపిస్తుంది. ప్రతి ఫుట్ బాల్ ఆటగాడికి ప్రాముఖ్యతనిస్తాం. ప్రస్తుతం మైదానంలో బాగానే అలరిస్తున్నాం. ఇంకా జట్టుకు కావలసని వాటిని ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ’ని సిమియోన్ అన్నాడు. అంతేకాకుండా తరువాత మ్యాచ్‌కు కావలసిన ఆటగాళ్లపై కూడా ఓ క్లారిటీను ఇచ్చాడు. ‘అందరూ కావాల్సిందే. వీరు ముఖ్యం వీరు ముఖ్యంకాదు అనడానికి ఎవ్వరూ లేరు. గత సీజన్‌లో ఎవ్వరు ఎక్కవ ఆడారు. వారి సామర్థ్యాల ప్రకారం ఈ సారి వారి స్థానాలను ఎస్తామ’ని చెప్పాడు. ఈ జట్ల మధ్య జరిగిన వరుస 20 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌ను కూడా అట్లాటికా గెలవలేదు. నిన్నటి విజయం మాకు ఎంతో ప్రత్యేకమనీ చెప్పాడు. ఫుట్ బాల్ అంటేనే ఒకసారి గెలుస్తాం మరోసారి ఓటమి రుచి చూస్తాం. కానీ బార్సాతో జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ మేము విజయానికి అతిచేరువకు వెళ్లాం. కానీ చివరకు ఓటమిని చవి చూశాం. కానీ ఈరోజు మేము గెలిచాం. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఇప్పడు అట్లాటికో నవంబరు 26న లొకొమొటివ్‌తో ఛాంపియన్స్ లీగ్‌లో తలపడేందుకు సిద్దమవుతుంది.