లెక్కలు చెప్పడం మా పనికాదు-ఐఏఎఫ్

లెక్కలు చెప్పడం మా పనికాదు-ఐఏఎఫ్

బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేశాం... టార్గెట్ పూర్తి చేయడమే మా లక్ష్యం.. చనిపోయినవారి లెక్కలు చెప్పడం మా పనికాదు అన్నారు ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ధనోవా.. వైమానిక దాడులపై రాజకీయ విమర్శలు పెరుగుతున్న సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన... వైమానిక దాడులపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేశామని.. ఉగ్రవాదులు ఎంత మంది అంతమయ్యారో మా దగ్గర సమాచారం లేదని.. వైమానికి దాడులపై రాజకీయాలు మాత్రం తగవన్నారాయన. టార్గెట్ పూర్తి చేయడమే మా లక్ష్యం.. చనిపోయినవారి లెక్కలు చెప్పడం, మృతుల వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారాయన. ఉగ్ర శిబిరాలపై దాడులు నిరంతర ప్రక్రియ అన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా.. మిగ్ 21 విమానాలకు పూర్తి సామర్థ్య ఉందన్నారు. అయితే, వైమానిక దాడులు జరగకపోతే పాకిస్థాన్ ఎందుకు స్పందిస్తుంది? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ దాడులుకు పాల్పడింది. అయితే, ఈ దాడిలో ఎంతమంది మృతిచెందారన్నదానిపై క్లారిటీ లేదు. ఓవైపు 300కు పైగా ఉగ్రవాదులు మృతిచెందారనే ప్రచారం సాగినా.. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా పెరిగాయి. అక్కడ ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారనేది బయటపెట్టాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ధనోవా వివరణ ఇచ్చారు.