మరో వివాదానికి తెరలేపిన కంగనా..!

మరో వివాదానికి తెరలేపిన కంగనా..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వర్సెస్ మహా సర్కార్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కంగనా మరో వివాదానికి తెరలేపింది. మహా గవర్నర్ తో భేటీ తరవాత కంగన వరుస ట్వీట్ లతో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్వీట్ చేసింది. ప్రత్యేక హక్కులను ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర అసెంబ్లీ అర్నాబ్ గోస్వామికి 60 పేజీల లేఖ పంపినట్లు పేర్కొన్న నివేదికకు సమాధానంగా... రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులకు వ్యతిరేకంగా స్వరం పెంచిన వారిని వేధించడంలో ప్రభుత్వం బిజీగా ఉందని  విమర్శించింది. ఈ మేరకు కంగనా  ట్విట్టర్ లో  "కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటిగా ఉంది, కేసుల సంఖ్యలు వేగంగా పెరుగుతున్నాయి, కానీ  ఫాసిస్ట్ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలను వేధించడంలో బిజీగా ఉంది.  మహారాష్ట్రలో రాష్ట్రపతి  పాలన కావాలి. " అంటూ ట్వీట్ చేసింది.