కాశ్మీర్ అమ్మాయిలను తెచ్చుకోవచ్చంట... బీజేపీ సీఎం అనుచిత వ్యాఖ్యలు 

కాశ్మీర్ అమ్మాయిలను తెచ్చుకోవచ్చంట... బీజేపీ సీఎం అనుచిత వ్యాఖ్యలు 

 

బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖలకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అసలు విషయాన్ని పెట్టి కొసరు విషయాల మీద హైలైట్ చేయించేలా వారి కామెంట్స్ సాగుతున్నాయి. తాజాగా కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన విషయంలో తమ బీజేపీని హైలైట్ చేసుకునే క్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని, కానీ ఇక ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు మోడీ షా లు లైన్ క్లియర్ చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

మహర్షి భగీరథ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారని, ఇకపై అలాంటి పరస్థితి ఉండ బోదని ఇక అందరి చూపు  కాశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుందని, మోడీ షాలు  ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతొనే అది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న యూపీ బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఇక అందమైన కాశ్మీరి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని , తమ కార్యకర్తలు అందరూ అందంగా, తెల్లగా ఉన్న కా శ్మీరీ అమ్మాయిలను పెళ్లాడొచ్చనే ఆనందంలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో రేగిన దుమారం మరువకముందే ఏకంగా సిఎం స్థాయి వ్యక్తి అలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు జమ్మూకాశ్మీర్ పునర్ విభజన తర్వాత కాశ్మీర్‌ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఎలా ప్రజలను సముదాయించి పరిస్థితులను మామూలు స్థితికి తీసుకురావడానికి కేంద్రం నానా పాట్లు పడుతుంటే బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు తమ స్థాయిని మరిచి అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జనానికి టార్గెట్ అవుతున్నారు.